షిండేవి బాధ్యతారహిత వ్యాఖ్యలు : బీవీ రాఘవులు
మెదక్: కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణపై బాధ్యతారహితమైన వ్యాఖ్యాలు చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. స్థానిక పీఎస్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వైఖరి కారణంగానే తెలంగాణ అంశం జాప్యమవుతోందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాదని సోనియాగాంధీ ఢిల్లీ నుంచి పంపిన బొమ్మ మాత్ర మేనని ఎద్దేవా చేశారు. తెదేపా, వైకాపాలతో కలిసే ప్రసక్తే లేదని తెలియజేశారు. వామపక్షాలను కలుపుకొని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా చెప్పారు. సీపీఐతో అభిప్రాయ బేధాలున్నా చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్నారు.