‘షిండే, బొత్స పిచ్చాసుపత్రిలో ఉండాల్సినోళ్లు’
హైదరాబాద్: పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండేలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మండిపడ్డారు. ‘షిండే, బొత్సలు పిచ్చాసుపత్రిలో ఉండాల్సినోళ్లు, వాళ్లు మంత్రులుగా ఉండటం ప్రజల దురదృష్టం ‘ అని అన్నారు. కాంగ్రెస్ నేతలు పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఒకే నాలుకతో రావాలి: నారాయణ
తెలంగాణపై డిసెంబర్ 28న జరిగే అఖిలపక్ష సమావేశానికి పార్టీల నుంచి ఎంత మంది వచ్చినా ఒకే నాలుకతో రావాలని నారాయణ కోరారు. రెండు నాలుకలు, మూడు నాలుకలతో వస్తే సహించేది లేదని హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజలు తెలంగాణకు వ్యతిరేకంకాదని, వారంతా తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగానే ఉన్నారని ఆయన తెలియజేశారు.