షిర్డీసాయినాధుని సేవలో కెసిఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి షిర్డీకి చేరుకున్నారు. షిర్డీ సాయిబాబాను సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. శుక్రవరాం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్‌ షిర్డీకి బయల్దేరిన విషయం విదితమే. షిర్డీ ఎయిర్‌పోర్టులో మహారాష్ట్రలో నివాసముంటున్న తెలంగాణవాసులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా గెస్ట్‌హౌజ్‌కు వెలల్‌ఇ దర్శనానికి బయలుదేరారు.