సంకుచిత రాజకీయాల కోసమే ఐటిఆఐఆర్‌ రద్దు

బీజేపీ డీఎన్‌ఏలో అసత్యాలు, అవాస్తవాలు
తెలంగాణకు శనిలా పట్టిన మోడీ
ఘాటుగగా విమర్శించిన మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): సకుంచిత రాజకీయాల కోసమే కేంద్రం ఐటీఐఆర్‌ రద్దు చేసిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఐటీఐఆర్‌ స్థాయిలో రాష్టాన్రికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్‌లో నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి దేశ ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేశామని తాజాగా పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ చేసిన ప్రకటనను కేటీఆర్‌ తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ డీఎన్‌ఏలో నిండి ఉన్న అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్దాలను ఎప్పటిలాగే అలవోకగా కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వల్లె వేశారని కేటీఆర్‌ విమర్శించారు. రాజకీయంగా వారితో విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో హైదరాబాద్‌ ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేసి.. మోదీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రాజెక్టు రద్దుతో హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ మరింత ఎదిగే అవకాశాన్ని కోల్పోయిందన్న కేటీఆర్‌, ప్రస్తుతం హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ సాధిస్తున్న ప్రగతికి కేంద్రం చేసింది ఏవిూ లేదన్నారు.ఐటీఐఆర్‌ రద్దుతో ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో తెలంగాణకు జరిగిన నష్టంపై వివరణ ఇవ్వాలని కేటీఆర్‌ ఇమాండ్‌ చేశారు. కేంద్రంలోని వివిధ శాఖలు ప్రవేశ పెట్టిన స్మార్ట్‌ సిటీ, ఇండస్టియ్రల్‌ కారిడార్లను తెలంగాణకు మంజూరు చేసినందుకే ఐటీఐఆర్‌ను రద్దు చేశామని కేంద్రం చెప్పడం వారి ఇంటలెక్చువల్‌ బ్యాంకురప్టసీకి నిదర్శనమని కేటీఆర్‌ మండిపడ్డారు. కనీసం ఐటీఐఅర్‌ రద్దుకు కేంద్రం పెర్కొంటున్న అయా పథకాల్లలోనూ తెలంగాణకి దక్కింది ఏం లేదన్నారు. ఐటీ పరిశ్రమ బలోపేతం కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన పథకాన్ని ఇతర రంగాల్లోని కార్యక్రమాలను చూపి రద్దు చేయడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికున్న విధానపరమైన నిబద్ధతకు నిదర్శనమని ఎద్దేశా చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌కు లెక్కలేనన్నీ కేంద్ర పథకాలను మంజూరు చేసుకుంటూ, తెలంగాణకు వస్తున్న చారానా, ఆఠానా మందం పనులను కూడా సాకుగా చూపెట్టడం దారుణమన్నారు. ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నా
యంగా హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమకు మోదీ ప్రభుత్వం ఇచ్చిందేంటో చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 2008 లో కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం హైదరాబాద్‌ ఐటీఐఆర్‌ ఏర్పాటు ప్రతిపాదన చేసి, 2013లో దానికి ఆమోదం తెలిపినా, అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే తెలంగాణకు శనిలా దాపురించిన మోదీ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు, విభజన హవిూల మాదిరె హైదరాబాద్‌ ఐటీఐఆర్‌ను కూడా మూలకుపెట్టిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు తాను కూడా వివిధ సందర్భాల్లో ఢల్లీి వెళ్లి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను ఐటీఐఆర్‌ గురించి అడిగామన్న కేటీఆర్‌, ఎన్నిసార్లు కోరినా తోలుమందం కేంద్ర ప్రభుత్వంలో చలనం రాలేదన్నారు. మోడీ ప్రభుత్వ నిష్కియ్రా పరత్వాన్ని గుర్తించినంకనే ఐటీఐఆర్‌ ప్రాజెక్టుకు సమానస్థాయిలో హైదరాబాద్‌ ఐటీకి అవసరమైన ఏదైనా పథకాన్ని ప్రకటించాలని కనీసం 50సార్లు కేంద్రాన్ని కోరమన్నారు. అయినా కూడా మోదీ ప్రభుత్వం హైదరాబాద్‌ ఐటీ ఈకో సిస్టమ్‌కు నయా పైసా మందం సహాయం చేయలేదని కేటీఆర్‌ విమర్శించారు. కేంద్రానికి హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ అభివృద్ధిపైన చిత్తశుద్ధి లేకనే, ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయం చూపలేదని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాలైన నోట్ల రద్దు, కరోనా లాక్‌ డౌన్‌, పాలసీ పారలసిస్‌లతో ఏర్పడ్డ ఆర్థిక, సామాజిక సంక్షోభంలోనూ దేశ సగటును మించిన అద్భుతమైన ప్రగతిని తెలంగాణ ఐటీ పరిశ్రమ సాధించిందన్నారు. ఒకవేళ ఐటీఐఆర్‌ ప్రాజెక్టు కనుకే ఉండి ఉంటే ఈ ఏడు సంవత్సరాల్లో హైదరాబాద్‌ ఐటీ ఎకో సిస్టం ఆకాశమే హద్దుగా అద్భుతంగా ఎదిగేదన్నారు.
హైదరాబాద్‌ ఐటీఐఆర్‌ ప్రాజెక్టుకు తాము చేస్తున్న ధోఖాను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ గల్లీ లీడర్లు పూటకో మాట మాట్లాడి ఇన్ని రోజులు పబ్బం గడుపుకున్నారని కేటీఆర్‌ దుయ్యబట్టారు. ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న మోదీ ప్రభుత్వం, రాజకీయంగా తమకు ప్రయోజనం కాదన్న ఏకైక కారణంతోనే ఐటీఐఆర్‌ను రద్దుచేసిందని కేటీఆర్‌ ఆరోపించారు. ఆధునిక భారత్‌ ను నిర్మించడంపై తమకున్న విధానపర అశక్తతను పార్లమెంట్‌లో ఒప్పుకుని తెలంగాణ ఐటీ గ్రాడ్యుయేట్లు, వృత్తి నిపుణులు, యువతకు మోదీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై ఇక్కడి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నా.. ప్రధాని మోదీలో చలనం రావడం లేదని కేటీఆర్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అద్భుతంగా పురోగమిస్తున్న తెలంగాణ ఐటీ రంగ ప్రగతిని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న మోడీ ప్రభుత్వ నికృష్ట రాజకీయానికి ఈ మధ్యనే ప్రకటించిన సాప్ట్‌ వేర్‌ పార్కులే సాక్ష్యం అన్నారు.
ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, కర్నాటక, హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానా, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, బీహార్‌, పంజాబ్‌, జార్ఖండ్‌, కేరళ రాష్టాల్రకు సాప్ట్‌ వేర్‌ పార్క్‌లను కేటాయించిన కేంద్రం, తెలంగాణకు మరోసారి అన్యాయం చేసిందన్నారు. ఈ విషయంలోనూ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా స్పందన లేదన్నారు. దేశవ్యాప్తంగా 22 సాప్ట్‌వేర్‌ పార్కులను ప్రకటిచించి తెలంగాణకు మెండిచేయి చూపడం బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న చిన్నచూపునకు నిదర్శనమన్నారు. ఒకవైపు ఐటీఐఆర్‌, సాప్ట్‌వేర్‌ పార్కుల్లో తెలంగాణకు స్థానం ఇవ్వని కేంద్రం, తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్‌ టీ హాబ్‌ `2 నిర్మాణాన్ని రూ.450 కోట్లతో పూర్తి చేస్తే, దానికి కేంద్రం నుంచి పైసా సహాయం లేదన్నారు. యువతకు ఉపాధి కల్పించే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముందుచూపు లేదని, యువతకు ఉపాధి కల్పణ, శిక్షణ రంగాల్లో కేంద్రం విఫలం అయిన విషయాన్ని దేశంలోని యువత, నిరుద్యోగులు గమనిస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. ఇలా తెలంగాణ ఐటీ రంగంతోపాటు, అన్ని అంశాల్లో రాష్టాన్రికి
అన్యాయం చేస్తున్న కేంద్రం విధానాలను ఇక్కడి యువత గమనించాలని కోరారు. మరోపైపు కేంద్రం సంపూర్ణ సహాయ నిరాకరణ, వివక్ష చూపుతున్న ఉపాధి కల్పనలో తెలంగాణ ముందువరుసలో ఉన్న విషయాన్ని కేటీఆర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పటికైనా దేశ ఐటీ రంగానికి దిక్సూచిగా ఎదుగుతున్న తెలంగాణ ఐటీ రంగానికి కేంద్రం ప్రత్యేకంగా ఐటీఐఆర్‌కు సమానంగా ఒక పథకాన్ని లేదా ప్యాకేజీని ప్రకటించి తెలంగాణ పట్ల తమ నిబద్దత చాటుకోవాలని కేటీఆర్‌ సూచించారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ మరింతగా ఎదిగే అవకాశాన్ని కోల్పోయిందన్నారు. యువతకు ఉపాధి కల్పించే విషయంలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి ముందుచూపు లేదన్న కేటీఆర్‌… ఉపాధికల్పన, శిక్షణారంగాల్లో కేంద్రం విఫలమైన విషయాన్ని దేశంలోని యువత, నిరుద్యోగులు గమనిస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా యువత మేలుకో… తెలంగాణ ఐటీరంగంతో పాటు అన్ని అంశాల్లోనూ రాష్టాన్రికి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఇక్కడి యువత గమనించాలని మంత్రి కోరారు. కేంద్రం సంపూర్ణ సహాయ నిరాకరణ, వివక్ష చూపుతున్నఉపాధి కల్పనలో తెలంగాణ ముందువరుసలో ఉన్న విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఇప్పటికైనా దేశ ఐటీ రంగానికి దిక్సూచిగా ఎదుగుతున్న తెలంగాణ ఐటీ రంగానికి కేంద్రం ప్రత్యేకంగా ఐటీఐఆర్‌కు సమానంగా ఒక పథకాన్ని లేదా ప్యాకేజీ ప్రకటించి తెలంగాణ పట్ల తమ నిబద్దత చాటుకోవాలని కేటీఆర్‌ సూచించారు.