సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న విదేశీ వనితలు
వరంగల్ : సంక్రాంతి సందడి ముందుగానే ప్రారంభమైంది. వరంగల్ లో విదేశీయుల ఆట పాటలమద్య సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి..ఖాజీపేటలోని బాలవికాస స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలలో కెనడా, సూడాన్, బంగ్రాదేశ్, శ్రీలంకా, నేపాల్ దేశాలకు చెందిన సుమారు 40 మంది విదేశీయులు పాల్గొన్నారు. విదేశీ వనితలు రంగు రంగుల ముగ్గులు వేసి..ఆ ముగ్గుల మధ్య గొబ్బెమ్మలను పెట్టి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు.
సంక్రాంతి పిండి వంటలను ఆస్వాదించారు. నృత్యాలు చేస్తూ..గంగిరెద్దు విన్యాసాలు తిలకిస్తూ ఆనందంలో మునిగిపోయారు. పంటలు ఇంటికి వచ్చిన వేళ సంక్రాంతి పండగ జరుపు కోవడం ఒక మంచి సాంప్రదాయమని..సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొనడం తమకు ఆనందంగా ఉందని విదేశీ యువతీయువకులు అన్నారు.