సంక్షేమంలో కెసిఆర్‌ ముందున్నారు

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

కొత్తగూడెం,జూలై31(జ‌నం సాక్షి): ప్రజలు జీవితాల్లో మార్పులు తెచ్చేలా సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదింటి గర్భిణులకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ పథకం ఒక వరాన్ని ప్రసాదించింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు చేసుకున్న గర్బిణులకు వీటిని అమలు చేస్తున్నారు. ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో తమ పేర్లను నమోదు చేసుకోవడంతో ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసిన కేసీఆర్‌ కిట్‌ పథకం వారికి వరంగా మారిందని అన్నారు. కేసీఆర్‌ కిట్‌లో 15 రకాల వస్తువులు తల్లీబిడ్డ అవసరాలకు ఉపయోగపడుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. పేద బాలింతలు ఈ కిట్‌లు బయట కొనుగోలు చేసుకోవాలంటే ఆర్థిక భారం పడుతున్నందున ప్రభుత్వమే వాటిని ఉచితంగా సరఫరా చేసేందుకు నిర్ణయించిందన్నారు. కేవలం కేసీఆర్‌ కిట్‌కే పరిమితం కాకుండా ప్రసవం అయిన తల్లికి రూ.12 వేలు పారితోషకం ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింన్నారు. ఈ పదిహేను రకాల కిట్‌లలో బేబీ బెడ్‌, బేబీ మాకింగ్‌టోస్‌, బేబీ డ్రెస్సెస్‌, బేబీ టవల్స్‌, న్యాప్‌కిన్స్‌, జాన్సన్స్‌ బేబీ సోప్‌, శాంపు, ఆయిల్‌, తల్లులకు సబ్బులు, రెండు చీరెలు, బాక్స్‌, టాటల్‌ టాయ్‌, కిట్‌బాక్స్‌, బాస్కెట్‌లను ఈ కేసీఆర్‌ కిట్‌లో ఉంచారని అన్నారు.