సంక్షేమంలో తెలంగాణను మించింది లేదు: ఎంపి
మహబూబాబాద్,ఫిబ్రవరి28(జనంసాక్షి): రైతు సంక్షేమంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. సకల జనుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. రైతులకు అండగా నిలిచేలా పెట్టుబడి పథకం దేశం ఎక్కడైనా అమలు చేస్తున్నారా చెప్పాలన్నారు. కర్నాటకలో ఎందుకు అమలు చేయడం లేదో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను మభ్యపెట్టలేరని అన్నారు. ప్రతి వర్గానికి చేదోడువాదోడుగా నిలిచేలా పథకాలు అమలు చేస్తున్న సిఎం కెసిఆర్, పండుగలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి అధికారికంగా పండుగ నిర్వహించడం హర్షణీయమన్నారు. బంగారు తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న నిరంతర కృషితో జరుగుతోన్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ప్రజలు అభివృద్దిని చూసే టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. నాయకులు తమ స్వలాభం కోసం, స్వార్థం కోసం సిద్ధాంతాలను విస్మరించడం వల్లే టీఆర్‌ఎస్‌లో చేరారని స్పష్టం చేశారు. తండాలన్నీ కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసి ఎన్నికలు జరిపిన ఘనత కెసిఆర్‌దన్నారు. అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందినవారు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్శితులై భారీగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న అద్భుతమైన సంక్షేమ పథకాలతోనే టీఆర్‌ఎస్‌లోకి వలసలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు.