సంక్షేమమే కెసిఆర్ లక్ష్యం
మెదక్,జనవరి18(జనంసాక్షి): రైతులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఆస్పత్రులు, హాస్టళ్ల నిర్మాణం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇలా అనేక కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా ఉండాలని కోరారు. గోదావరి జలాలతో పంటలు సాగు చేసుకోవాలనే రైతుల కల.. త్వరలోనే సాకారం అవుతందని తెలిపారు. కాళేశ్వరం ద్వారా శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవ పథకం చరిత్రలో నిలిచి పోనుందన్నారు. 85 టీఎంసీల సామర్థ్యం ఉన్న మధ్య మానేరు ప్రాజెక్టు నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేస్తున్న తీరును కాంగ్రెస్ నేతలు వెళ్లి చూడాలన్నారు. రాత్రి పూట ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనూ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తోటపల్లి విూదుగా గౌరవెళ్లి, గండిపల్లి రిజర్వాయర్లకు నీరు వస్తుందన్నారు. తొందరగా ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేస్తే రైతుల కష్టాలు తీరుతాయన్నారు. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణతో జిల్లాలో వేల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. రైతులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే అవసర లేకుండానే పాసు పుస్తకంతోపాటు ఇతర ధ్రువపత్రాలు పహాణి నకలును అందచేయడం జరుగుతుందన్నారు.