సంక్షేమ పథకంలో తెలంగాణ దేశానికి ఆదర్శం

 ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
 యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి .
ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని భువనగిరి నియోజక వర్గ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు.
ఈనెల 16, 17, 18 తేదీలలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు 16 తేదీ శుక్రవారం నాడు భువనగిరి నియోజక వర్గానికి సంబంధించి భువనగిరి పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది.
భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్రెడ్డి, జిల్లా కలెక్టరు  పమేలా సత్పతి ర్యాలీని ప్ర్రారంభించారు. స్థానిక సాయి కన్వెన్షన్ హాలు నుండి గంజ్ వరకు చేపట్టిన ర్యాలీలో ప్రజాప్రతినిధులు, మహిళలు, విద్యార్థులు, ప్రజలు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనంతరం గంజ్ లో జరిగిన సభలో శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా కనీ వినీ ఎరుగని రీతిలో జరిగిన ర్యాలీలో వివిధ గ్రామాల నుండి వచ్చిన మహిళలు, విద్యార్థులు, ప్రజలకు శుభాభినందనలు తెలిపారు. తెలంగాణ గడ్డ ఉద్యమాలకు పురిటి గడ్డ అని, తెలంగాణ సాయుధ పోరాటంలో 4800 మంది అసువులు బాసారని, రావి నాయణరెడ్డి నాయకత్వంలో ఈ గంజ్ స్థలంలోనే ఆంధ్రమహా సభ నిర్వహించబడి తిరిగి ఈరోజు ఈ విధంగా మనం సమావేశం కావడం సంతోషించదగిన విషయమని, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య తదితరుల పోరాటాల ఫలితంగా రాజరిక పాలన నుండి భారతదేశంలో కలవడం జరిగిందని, చరిత్రను అందరూ తెలుసుకోవాలి అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి మూలంగా తెలంగాణ రాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో ఉందని,  ఉద్యమం ద్వారా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చారని, అందరం కలిసి అభివృద్ధి పథంలో నడుద్దామని తెలియచేస్తూ ముఖ్యమంత్రికి ప్రత్యేక నమస్కారాలు తెలిపారు. ఆయన తెలంగాణ జాతిని ఏకరీతిగా నిడిపిస్తున్నారని కొనియాడారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డిసిపి నారాయణరెడ్డి, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి భూపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు జడల అమరేందర్ గౌడ్,  జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి భూక్యానాయక్, జడ్.పి.టి.సి బీరు మల్లయ్య, భువనగిరి ఎంపిపి నరాల నిర్మల, బీబీనగర్ ఎంపిపి ఎరుకల సుధాకర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు