సంక్షేమ పథకాల్లో తెలంగాణనంబర్ వన్ : ఎమ్మెల్యే
యాదాద్రి భువనగిరి,జూన్25(జనం సాక్షి ): నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అండగా నిలిచాయని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు.దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం ప్రథమస్థానంలో ఉందన్నారు. అన్ని గ్రామాల్లో గల నిరుపేద కుటుంబాలకు పార్టీలకు అతీతంగా డబుల్ బెడ్‌రూంలను నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తేనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం అవుతాయన్నారు. ఆడబిడ్డ పెండ్లి భారం కాకూడదనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో నిరుపేద ఆడపిల్లలకు సహాయం చేస్తున్నారు… ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరిస్తే పెళ్లి పెట్టుకోగానే పెండ్‌ల్లిపత్రిక తహసీల్దార్‌కు అందజేస్తే పెండ్లి వద్దకే వచ్చి చెక్కును అందజేస్తామని అన్నారు.గర్భిణులకు ఫౌష్టిహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తాన్ని జమ చేసి ఫౌష్టికాహార ప్యాకేజీఇస్తుందన్నారు. ఇప్పటికే హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు సన్నబియ్యం, మధ్యాహ్నభోజనం, విదేశాల్లో చదువుకునేందుకు ఒక్కో విద్యార్థికి రూ.20లక్షలు, ప్రతి సామాజిక వర్గానికి రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం వంటి పథకాలు అమలు చేస్తుందన్నారు. అభివృద్ధి పనుల విషయంలో అన్ని వర్గాల వారు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అలాగే ఒంటరి మహిళలకు ఆసరగా సీఎం పింఛన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో రాష్ట్రంలోని 3లక్షల మంది మహిళలు హర్షిస్తున్నారని అన్నారు. ఇకపోతే ప్రాజెక్టుల ద్వారా నీటి సరఫరాకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందులో భూములు కోల్పోతున్న రైతులు అందోళన చెందాల్సిన పనిలేదన్నారు. రైతులకు అండగా ఉంటానని, వారికి నష్టపరిహారంతో పాటు ప్రతి రైతుకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లను కట్టిస్తానని ఎమ్మెల్యే హావిూ ఇచ్చారు. అలాగే అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు తప్పకుండా నిర్మించుకోవాలని, నిర్మించుకోని లబ్ధిదారులకు ప్రభుత్వం రేషన్ సరుకులతో పాటు పింఛన్‌లను కూడా కట్ చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.