సంక్షేమ పాఠశాలలు వసతి గృహాలు,రెసిడెన్షియల్ పాఠశాలల్లో పారిశుధ్యo సక్రమ నిర్వహణ చేపట్టాలి:

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ*.                 నల్గొండబ్యూరో. జనం సాక్షి ,ఎస్.సి.,ఎస్. టి.,బి.సి.,మైనార్టీ సంక్షేమ శాఖల పాఠశాలలు,వసతి గృహాలు,రెసిడెన్షియల్ పాఠశాలలలో పారిశుధ్యం సక్రమంగా నిర్వహణ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాధిత్య భవన్ లో సంక్షేమ,రెసిడెన్షియల్ పాఠశాల లు,వసతి గృహాలు వార్డెన్ లు, ప్రిన్సిపాల్ లతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి పారిశుధ్యం, త్రాగు నీరు సరఫరాకు మిషన్ భగీరథ కనెక్షన్,ఆహార నాణ్యత(ఫుడ్ సేఫ్టీ),సీజనల్ వ్యాధుల పై సమీక్షించారు. సంక్షేమ పాఠశాలలు,రెసిడెన్షియల్ పాఠశాలలు,వసతి గృహాల లో పరిశుభ్రంగా వుండేలా పారిశుధ్యం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని,నీరు నిల్వ లేకుండా చూడాలని,వార్డెన్ లు,ప్రిన్సిపాల్ లు బాధ్యత వహించాలని అన్నారు.దోమలు లార్వా వృద్ది చెందకుండా పాగింగ్,ఆంటీ లార్వా ఆపరేషన్ చేపట్టాలని పంచాయతీ,మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.పరిసరాలు పరిశుభ్రంగా లేకుంటే సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం వుందని, అప్రమత్తం గా వుంటూ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆహారం నాణ్యత గా వుండాలని,పౌర సరఫరాల శాఖ నుండి సరఫరా చేసిన బియ్యం నాణ్యత లేకుంటే తిరిగి పంపించాలని అన్నారు. వార్డెన్ లు,ప్రిన్సిపాల్ లు విద్యార్థులతో పాటు భోజనం చేయాలని అన్నారు జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీ చేసి నివేదిక అందజేస్తారని, ఎటువంటి లోపాలున్నా చర్యలు తప్పవని అన్నారు.సంక్షేమ,రెసిడెన్షియల్ పాఠశాల లు,కళాశాల ల్లో,మిషన్ భగీరథ త్రాగు నీటి సరఫరా కోసం ప్రతి పాదనలు సంబంధిత శాఖల అధికారులు పంపాలని,మిషన్ భగీరథ శాఖ ద్వారా త్రాగు నీటి కనెక్షన్ లు ఏర్పాటు చేయాలని అన్నారు..ఎన్ని పాఠశాలలు,కళాశాలలు స్వంత భవనాల లో ఉన్నాయి,అద్దె భవనాల్లో ఉన్నాయి,అదే నియోజక వర్గం లో ఎన్ని ఉన్నాయి ,ఎక్కడ మిషన్ భగీరథ కనెక్షన్ అవసరం తెలుపాలని అన్నారు.సమావేశం లో డి.అర్. ఓ జగదీశ్వర్ రెడ్డి,జిల్లా విద్యా శాఖ అధికారి బిక్షపతి,షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సల్మా బాను,గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్,బి.సి.సంక్షేమ అభివృద్ధి అధికారిణి పుష్ప లత,మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి బాల కృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు  రెసిడెన్షియల్ పాఠశాల ల అర్.సి. ఓ.లు పాల్గొన్నారు

తాజావార్తలు