సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థుల మెస్,కాస్మోటిక్ చార్జీలు పెంచాలి
జాజుల లింగంగౌడ్
మిర్యాలగూడ. జనం సాక్షి
పెరిగిన ధరలకనుగుణంగా వసతి గృహ విద్యార్థులకు మెస్ చార్జీలు,కాస్మోటిక్ చార్జీలు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లేఖ రాసినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు..ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో పెంచిన మెస్ చార్జీలను ఇంకా కొనసాగిస్తుండటం వల్ల సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు తీవ్ర అనారోగ్యాల పాలై, సరియైన మెనూ లేకపోవడం వల్ల, గత 7 సంవత్సరాలు అవే మెస్ చార్జీలు ఉండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందడం లేదు,నేడు పెరిగిన ధరలకు అనుగుణంగా హై స్కూల్ స్థాయిలో రూ.ల 1000 నుంచి 3000 రూ.లకు పెంచాలని, కళాశాల వసతి గృహ విద్యార్థులకు రూ.ల 1500 నుండి 4000 రూపాయలకు పెంచాలి.గత 14 సంవత్సరాలుగా సంక్షేమ వసతి గృహా విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు పెంచడంలేదని పెరిగిన ధరలకు అనుగుణంగా బాలురకు రూ.62 నుంచి రూ.లు 300,బాలికలకు 75 రూ.నుంచి 500 రూ.పెంచాలని డిమాండ్ చేశారు.