*సంక్షేమ హాస్టల్, గురుకులాల్లో విధిగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలి*

పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి

, జూలై 14(జనంసాక్షి): సంక్షేమ హాస్టల్స్, గురుకులాల్లో హెల్త్ క్యాంపులును విధిగా నిర్వహించాలని పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి ప్రకటన విడుదల చేస్తూ మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అధిక వర్షాలు కురుస్తున్నందువలన జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టల్స్, గురుకుల పాఠశాల కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు విష జ్వరాలు సీజనల్ వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. విద్యార్థులు ఎదుర్కొనే సీజన్ వ్యాధులు పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మురుగునీరు ఎక్కువ శాతం నిల్వ ఉండడం వలన దోమలు కుట్టడం వలన వచ్చే సీజనల్ వ్యాధులు విష జ్వరాలు, చికెన్ గునియా, మలేరియా లాంటి వ్యాధులను అరికట్టడంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వసతి గృహాల్లో మెడికల్ హెల్త్ క్యాంపుల ఏర్పాటు చేసి విద్యార్థులకు సరైన వైద్యం అందించాలని కోరారు.