సంక్షేమ హాస్టళ్ళలో మౌలిక సౌకర్యాలను మెరుగుపరుచాలి : కలెక్టర్‌

నల్లగొండ, నవంబర్‌22: సంక్షేమ వసతి గృహలలో విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికి పాటుపడాలని అధికారులను అదనపు జాయింట్‌ కలెక్టర్‌ నీలకంఠం ఆదెశించారు. గురువారంనాడు  కలెక్టరేట్‌ కార్యాలయంలో సంక్షేమ శాఖ అధికారుల సవిూక్షా సమావేశానికి అదనపు జె.సి. అధ్యక్షత  వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్ళలో  మౌలిక సౌకర్యాలను మెరుగు పరచడానికి తమ పరిధిలోని మున్సిపల్‌, పంచాయతీ అధికారులను కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు దుప్పట్లు, బకెట్లు, యూనిఫాంలు సత్వరమే అందించాలని ఆదెశించారు. యూనిఫాంలు అందని విద్యార్థులకు ఈ నెల చివరి నాటికి ఖచ్చితంగా అందించాలని ఆదెశించారు. హాస్టల్‌ వద్ద అప్రోచ్‌ రోడ్ల నిర్మాణానికి అవసరమై ప్రతిపాదలు అందజేయాలని ఆదెశించారు. హాస్టల్‌లో ఉన్న  విద్యార్థుల కమిటీలు సక్రమంగా పని చేసిప్పుడె సమస్యలు ఉత్పన్నం  కావని, ఒక వేళ కమిటీలు సక్రమంగా పని చేయనట్లైతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని సూచించారు. అద్దె భవనాలలో కొసాగుతున్న  హాస్టల్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి విద్యార్థిని తమ సొంత పిల్లలగా చూసుకోవాలని ఆయన అధికారులను ఆదెశించారు. అధికారులు ప్రతి హాస్టల్‌ను  వి ధిగా సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను ఉన్నతాధికారుల దృస్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పిల్లల ఆరోగ్యం పట్ల తగి శ్రద్ద వహించాలని ఆదెశించారు