సంగారెడ్డిలో న్యాయవాదులపై లాఠీఛార్జీ

మెదక్‌: తెలంగాణ అడ్వొకేట్‌ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ చలో సంగారెడ్డి’ ధర్నాను పోలీసులు హింసాత్మకంగా మార్చురు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ విద్రోహానికి పాల్పడుతున్నాడంటూ ఆయన ఇంటిని ముట్టడించేందుకు వెళ్లిన న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. సంగారెడ్డి కోర్టు నుంచి ర్యాలీగా వెళ్తోన్న న్యాయవాదులను అడ్డుకునేందుకు పోలీసులు అడ్డుకున్నారు. సంగారెడ్డి కోర్టు నుంచి ర్యాలీగా వెళ్తోన్న న్యాయవాదులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ముందుకు సాగిపోతోన్న న్యాయవాదులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జీ చేశారు. ఈ లాఠీఛార్జీలో గంప వెంకటేశం అనే న్యాయవాది కాలు విరగొట్టారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం తెలిసింది.