సంగారెడ్డి కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్‌, అసదుద్దీన్‌

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా కలెక్టర్‌ను దూషించిన కేసులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌, ఆయన సోదరుడు అక్బరుద్దీన్‌ సంగారెడ్డి న్యాయస్థానంలో హాజరయ్యారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మారుతీదేవి కేసు విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు.