సంగారెడ్డి కోర్టులో అక్బరుద్దీన్‌ను హాజరుపరిచిన పోలీసులు
సంగారెడ్డి : కలెక్టర్‌ను దూషించిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను పోలీసులు సంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. ఇందు కోసం ఆయన్ను ఈ ఉదయం ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి సంగారెడ్డికి తరలించారు. ఇదే కేసులో హాజరయ్యేందుకు వచ్చిన ఎంపీ అసదుద్దీన్‌తోపాటు నలుగురు పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు అక్బరుద్దీన్‌కు కోర్టు గంటపాటు అనుమతి ఇచ్చింది.