సంగారెడ్డి కోర్టులో లొంగిపోయిన ఎంపీ అసదుద్దీన్
మెదక్ : ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ సంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. 2005లో అప్పటి కలెక్టర్ అనీల్‌కుమార్‌ను దూషించిన కేసులో ఆయన విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. అసదుద్దీన్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.