సంఘం అభివృద్ధి కోసం కృషి చేయాలి..
శంకరపట్నం జనం సాక్షి ;
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధి కోసం పాలకవర్గ సభ్యులతో పాటు సంఘ సభ్యులు తమ వంతు కృషి చేయాలని తాడికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఉపాధ్యక్షులు నరహరి వెంకట రమణారెడ్డి కోరారు. శుక్రవారం సంఘం మహాసభ ఉపాధ్యక్షుడు వెంకట రమణారెడ్డి అధ్యక్షతన తాడికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లోని గోదాంలో నిర్వహించారు. ఈ మహాసభలో సంఘం ముఖ్య కార్యనిర్వహణ అధికారి కొరిమి వేణుమాధవ్, సమావేశాన్ని నిర్వహించి, సహాయ కార్య నిర్వహణ అధికారి పోలు వీరస్వామి సంఘం 2022/2023 సంవత్సరము ఆదాయవ్యయాలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ సంఘం అభివృద్ధి కోసం, పాలకవర్గ సభ్యులతో పాటు, సంఘం సభ్యులు, వాటాదారులు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పాలవర్గ సభ్యులు శేషాచార్యులు, కలకుంట్ల సత్యనారాయణ రావు, మాచర్ల పద్మ, జూల శ్రీనివాస్, మేడిశెట్టి శ్రీనివాస్, తిరుపతి సమ్మయ్య, తోపాటు, సంగం పరిధిలోని తాడికల్ , ఎరడపల్లి ,ముత్తారం ,వన్నారం, కరీంపేట్, అంబాలాపూర్, కేశవపట్నం, వంకాయ గూడెం, ఇప్పల పల్లె ,గ్రామాలకు చెందిన సంఘ సభ్యులు, వాటాదారులు తదితరులు పాల్గొన్నారు.