సంచార జాతుల అభివృద్ధికి అధికారులు ప్రత్యేక కృషి చేయాలి

 సంక్షేమ బోర్డు సభ్యులు తురక నర్సింహ
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జిల్లాలో సంచార జాతుల అభివృద్ధికి అధికారులు ప్రత్యేక కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ విముక్తి, సంచార జాతుల అభివృద్ధి,సంక్షేమ బోర్డ్ సభ్యులు తురక నర్సింహ అన్నారు. మంగళ వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సంచార జాతుల సంక్షేమంపై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక న్యాయ లక్ష్యంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాయని ఆదిశగా అధికారులు అందేలా చూడాలని అన్నారు.అలాగే సంచార జాతుల పిల్లలకు జిల్లాలో అన్ని పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించి గుణాత్మకమైన విద్యానందించాలని సూచించారు.ఇప్పటి వరకు సంబంధిత శాఖల వారీగా అమలు చేసిన పథకాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డిఈఓ అశోక్, డిఎఫ్ఓ ముఖుంధ రెడ్డి, డిఎస్పి నాగభూషణం,  సంక్షేమశాఖల అధికారులు శంకర్, జ్యోతి పద్మ , దయానంద రాణి, అనసూర్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.