సంతాప తీర్మాణంలో తెలంగాణ పేరెత్తని ఎర్రబెల్లి దయాకర్‌రావు
హైదరాబాద్ జనంసాక్షి: టీడీపీ మహానాడులో టీటీడీపీ కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టిన అమరుల సంతాప తీర్మాణంలో తెలంగాణ పదాన్ని రాకుండా జాగ్రత్తపడ్డారు. ప్రాంతీయ ఉద్యమాలలో బలిదానాలు చేసేకున్నవారందరికి తెలుగుదేశం పార్టీ నివాళులర్పించాలని ఎర్రబెల్లి తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీర్మాణాన్ని ఆమోదిస్తూ ప్రాంతీయం అనే పదం కూడా ఉచ్చరించకుండా ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రి కాగానే విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేస్తానన్నారు.