సంరక్ష….గుండెకు రక్ష
ఖిలా వరంగల్ మండలం, జనంసాక్షి(అక్టోబర్20):-
ఇక పై హైదరాబాద్ కు వెళ్లకుండా వరంగల్ లోనే ఓపెన్ హార్ట్ సర్జరీలు.వరంగల్ సంరక్ష హాస్పటల్ లో 27 మంది కి అరోగ్య శ్రీ పథకం క్రింద ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసి విజయవంతం సాధించిన సంరక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పటల్.ఈ సందర్భంగా హాస్పటల్ ఏర్పాటు చేసిన చేసిన మీడియా సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా వరంగల్ మహానగరంలో మొట్టమొదటి సారిగా సంరక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు గత రెండున్నర నెలల కాలంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితముగా 27 మందికి గుండె శస్త్ర చికిత్సలు డాక్టర్లు శ్రీనివాస్,దుస్సా, లక్ష్మీదీపక్, సుధాకర్ రావు, శ్రావణ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ థియేటర్ టీం సహకారంతో విజయవంతం అయ్యిందని తెలిపారు.కావున ప్రజలు సంరక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన హాస్పటల్ యాజమాన్యం. ఈ కార్యక్రమంలో హాస్పటల్ యాజమాన్యం, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.