సంవత్సరం పాటు కాకతీయ ఉత్సవాలు నిర్వహణ మంత్రి సారయ్య
వరంగల్, ఆగస్టు 2 : కాకతీయ ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహిస్తామని, రాష్ట్ర బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. గురువారం మనగుడి కార్యక్రమాన్ని హన్మకొండలోని వెయ్యి స్థంభాల దేవాలయంలోను, వరంగల్‌లోని రామన్నపేట వేంకటేశ్వరస్వామి దేవాలయంలోను మంత్రి ప్రారంభించి, గుడిలో పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ, కాకతీయ ఉత్సవాల నిర్వహణ హైదరాబాద్‌లో టూరిజం శాఖమంత్రితో సమావేశమై చర్చించినట్టు తెలిపారు. ప్రజలలో ఆధ్యాత్మిక పెంపొందించి, నైతిక విలువలను కాపాడటానికి మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వరంగల్ నగరాన్ని గ్రేటర్ వరంగల్‌గా రూపొందించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నామని, నగరం చుట్టు రింగు రోడ్డు నిర్మాణానికి ప్రయత్నిస్తున్నామని తెలపారు. ఈ సందర్భంగా మహిళలు మంత్రికి రాఖీలను కట్టి రక్షబంధన్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అనంతరం వెంకటేశ్వరస్వామిగుడి, గణేషఫ్ నగర్‌లో మనబడిలో పాల్గొన్నారు. వరంగల్ నగరంలోని 6వ డివిజనల్‌లోని శాలి వాహన నగర్ కాలనీకి 5,60లక్షలు నీటి పైపు లైన్లు నిర్మాణపు పనులను చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ సహాయ కమీనర్, వెయ్యి స్థంబాల దేవాలయం ప్రధాన పూజారి గంగు ఉపేంద్ర శర్మ, కాంగ్రెసు నాయకులు, వి.ప్రకాశ్,కె.రవీందర్, బస్వరాజు శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు