సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): విద్యార్థులు విద్యతో పాటు మన పండుగలు, సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కలిగి వుండాలని స్థానిక 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు.శనివారం స్థానిక విద్యానగర్ లో శ్రీ లక్ష్మీ వెంకట సాయి ఒకేషనల్ కాలేజ్ కరస్పాండెంట్ బాల గౌడ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన ఆమె మాట్లాడుతూ నేటి యువత యాంత్రిక జీవితానికి అలవాటుపడి మన సంస్కృతి, సంప్రదాయాలు మరచిపోతున్నారని అన్నారు.ఇటువంటి సమయంలో మన పండుగలను సంప్రదాయ పద్దతిలో జరుపుకోవడం హర్షణీయమని అన్నారు.విద్యార్థులు కృష్ణా, గోపికల వేషధారణతో ఆకట్టుకున్నారు.అనంతరం ఆనందోత్సాహాల మధ్య ఉట్డి కొట్టే కార్యక్రమంను కన్నుల పండువగా నిర్వహించారు.జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు , పట్టణ వస్త్ర సంఘం అధ్యక్షుడు గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వారు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ విజయలక్ష్మి , కరస్పాండెంట్ బాల గౌడ్, అధ్యాపకులు సరస్వతీ , రేణుక, పద్మ , నాగరాణి, నరేష్, వీరన్న , లక్ష్మయ్య , శ్రీనివాస్, సంతోష్ , సాలయ్య , భిక్షం, సందీప్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.