సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి.

 

 

 

 

సభ్యులు వెడ్మ బొజ్జు పటేల్.

జనం సాక్షి ఉట్నూర్.

సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనీ టిపిసిసి సభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఉట్నూర్ మండలంలోని కల్లుర్ గూడ లో టిపిసిసి సభ్యులు అదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెడ్మ భోజ్జు మాట్లాడుతూ ఆదివాసుల జీవితంలో ఒక సారి ఎత్మ సుర్ దేవతకి తలనీలాలు,కన్ను బొమ్మలు సర్పించడం ఆదివాసుల ఆనవాయితీ,దీపావళికి వారం రోజుల ముందు బోగి రోజున కన్ను బొమ్మలు,తల వెంట్రుకలను సమర్పిస్తారు,ఇల చేయడం వలన శుద్ధి అవడం అనేది జరుగుతోంది.పండిన పంటలో రాసి(కుప్ప) వేసినపుడు పనులు చేసే తప్పుడు కన్ను బొమ్మలు తీయని వారు ఆ పని చేయరాదు,కన్ను బొమ్మలు తీసిన తర్వాతనే ధాన్యాలు రాశులలో పైకి ఎక్కి పని చేసే అర్హత ఉంటది.జీవితంలో అంత మంచి జర్గుతదనీ ఆదివాసుల నమ్మకం.ఈ కార్యక్రమమును ప్రతి సంవ్సరము చేయరు.20 లేదా 30 సంత్సరాలకు ఒక సారి తీస్తారు.తీసిన వారు మళ్ళీ మళ్ళీ తీయరు.సుమారు 20 సంత్సరకాలం తర్వాత ఈ రోజు ఉట్నూర్ మండలం కల్లురుగుడ లో సుమారు 40 మందికి కన్ను బొమ్మలు,తల వెంట్రుకలను తీయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ దంపతులు హాజరై వారి ఇద్దరు పిల్లలకు కూడా వారి సంప్రదాయం ప్రకారం కన్ను బొమ్మలు,తల వెంట్రుకలు తియించడం జరిగింది.ఈ కార్యక్రమం చేయడనికి ప్రత్యేకించి మంగలి వారినీ మాట్లాడి వారికి బట్టలు పెట్టీ,కుడకలు ఇచ్చి వారి ద్వార తియిస్తరు.మంగలి వారు వెంకట్ రమణ,తిరుపతి,ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ ఆత్రం సోనేరావు,ఆత్రం రాము, వెడ్మ భీమ్ రావు, వెడ్మ ఇంద్రు,ఆత్రం బరిక్రావు,ఆత్రం మారుతి,ఆత్రం ష్యంరావు, సోయం అర్జున్,కనక మారుతి తదితరులు ఉన్నారు.