సఖి భవన నిర్మాణానికి శంకస్థాపన చేసిన చీఫ్ విప్ గొంగళి సునీత

భువనగిరి, జనం సాక్షి
భువనగిరి పట్టణం మాసుకుంటలో 48 లక్షలతో నిర్మించబోయే సఖి కేంద్ర భవన నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి,  భువనగిరి శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి శంఖుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. జిల్లా మహిళా శిశు వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ చెందిన సఖి కేంద్రం ద్వారా ఒకే చోట నుండి బాలికలు, స్త్రీల సంక్షేమ కొరకు ఐదు అంశాలలో వైద్య సేవలు, కౌన్సిలింగ్ సేవలు, పోలీసు సహాయం, న్యాయ సహాయం, తాత్కాలిక వసతి సేవలు అందించడం జరుగుతుంది. 2019 నవంబర్ మాసం నుండి మొదలైన సఖి కేంద్రం ద్వారా ఇప్పటివరకు 705 కేసులు నమోదు కాగా,  వీరిలో 342 మందికి వసతి కల్పించడం, మిగతా వారికి కౌన్సిలింగ్ సేవలు అందించడం జరిగింది.శంఖుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు  పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి,  రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పోరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగరి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, ఎంపిపి  నిర్మల, ఎసిపి వెంకటరెడ్డి, భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, సఖి కేంద్రం ఎన్జీవో డాక్టర్ ప్రమీల, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, ప్రజాప్రతినిధులు, సిడిపిఓలు, అధికారులు పాల్గొన్నారు.
Attachments area