సఖి సెంటర్ సేవలపై అవగహన కార్యక్రమం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్6.(జనం సాక్షి):
బిజినపల్లి , వట్టెం, రాంరెడ్డి పల్లి తాండ, గుమ్మకొండ గ్రామ మహిళలు ఉపాధిహామీ పనులు చేస్తుండగా వారికి సఖి సెంటర్ కౌన్సెలర్ హర్షి యా, కేసు వర్కర్ వనజ సఖీ సెంటర్ సేవలపై అవగాహనా కల్పించారు. అదేవిదంగా గృహహింస, వరకట్న వేధింపులు, బాల్యవివాహాలు, లైగింక వేధింపులు, సైబర్ నేరాలపై అవగాహన కలిపించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో స్వచ్చంద సంస్థ శ్రామిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో ఈ సఖి కేంద్రం 24/7 పని చేస్తుంది. ఈ ఆఫీస్ ద్వారా కౌన్సెలింగ్, పోలీస్ సహాయం, న్యాయ సలహాలు, వైద్య సేవలు అవసరమున్న భాదితులకు 5 రోజుల తాత్కాలిక వసతి, మరియు బాధిత మహిళా వివరాలు గోప్యం గా ఉంచుతారు. జిల్లాలో హింసకిలోను అవుతున్న బాధిత మహిళలు ఉంటే ఈ టోల్ ఫ్రీ నెo. 181 సఖి ఆఫీస్ నెo. 99519 40181 లేదా కొల్లాపూర్ చౌరస్తా వైభవ్ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న సఖి ఆఫీసులో సంప్రదించగలరని తెలిపారు.