సచిన్ జెర్సీకి రూ.ఆరు లక్షలు..
హైదరాబాద్: సచిన్ తెందుల్కర్.. ఈ పేరుకి క్రికెట్ అభిమానుల్లో ఉన్న క్రేజే వేరు. అదే మరోసారి రుజువైంది. మాస్టర్ బ్లాస్టర్ తన వీడ్కోలు టెస్ట్‌లో ధరించిన జెర్సీకి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వేలం నిర్వహించారు. వివిధ ఛారిటీస్ నిమిత్తం క్రిస్టీస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్రికెట్ దేవుడి జెర్సీ రూ.ఆరు లక్షలు పలికింది. జోధ్‌పూర్ రాజవంశానికి చెందిన శివ్‌రాజ్ సింగ్ అనే రాజు ఈ మొత్తాన్ని చెల్లించి సచిన్ జెర్సీని సొంతం చేసుకున్నారు. సచిన్ జెర్సీతోపాటు ప్రముఖులకు సంబంధించిన విలువైన వస్తువులకూ వేలం నిర్వహించారు. వీటన్నిటికి కలిపి మొత్తంగా రూ.80 లక్షలు సమకూరాయట. ఈ మొత్తాన్ని తల, మెదడు సంబంధిత గాయాలకు గురైన పేద పిల్లల వైద్యానికి వినియోగించనున్నట్లు సంస్థ చెబుతోంది.