సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్ష దాయకం..
– జడ్పిటిసి సభ్యురాలు శాంతకుమారి రవీందర్.
ఊరుకొండ, సెప్టెంబర్ 18 (జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన సచివాలయానికి ప్రపంచ మేధావి అయిన.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని నిర్ణయించడం అభినందనీయమని జడ్పిటిసి సభ్యురాలు శాంతకుమారి రవీందర్ హర్షం వ్యక్తం అన్నారు. ఆదివారం ఊరుకొండ మండల పరిధిలోని రేవల్లి గ్రామంలో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ.. నూతన సచివాలయానికి సరైన పేరు నిర్ణయించడం కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కే సాధ్యమని, కేసీఆర్ కు ఎవరూ సాటి లేరని స్పష్టం చేశారు. భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కొందరి వాడు కాదు, అందరివాడు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయానికి ప్రపంచ మేధావి పేరు పెట్టి ఈ రకంగా మరోసారి రుజువు చేయడం పట్ల ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దళితుల సంక్షేమం కోసం దళిత బంధు, గిరిజన సంక్షేమం కోసం గిరిజన బంధు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు.