సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల

5 జనవరి 26న ముహుర్తం

హైదరాబాద్‌,అక్టోబర్‌23 అక్టోబర్‌23(జనంసాక్షి):

సత్పవ్రర్తన కలిగినఖైదీలను జనవరి 26న విడుదల చేస్తామని ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్పవ్రర్తన కలిగిన ఖైదీల విడుదల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వివిధ కేసుల్లో శిక్షపడి, మంచి ప్రవర్తనతో మార్పు వచ్చిన వారితో పాటు అనారోగ్యం పడిన వారిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేసి ఖైదీల జాబితా రూపొందించాలని జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్‌ను ఆదేశించినట్లు వెల్లడించారు. జాబితా రూపొందిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఈ విషయం చర్చించనున్నట్లు నాయిని చెప్పారు. ఖైదీలకు పరివర్తన వచ్చేలా జైళ్ల శాఖ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఖైదీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. చంచల్‌గూడ జైలులో రూ.10కోట్లతో నిర్మించిన కొత్త భవనాన్ని ¬ంమంత్రి నాయిని నర్సింహరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, జైళ్ల శాఖ డీజీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ… ఖైదీల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.  చంచల్‌గూడ జైలులో నూతన బ్యారక్‌ను ప్రారంభించడానికి వచ్చిన నాయిని  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూకాంప్లెక్స్‌ నిర్మాణంలో అవకతవకలపై ప్రశ్నించిన జర్నలిస్టులపై ¬ంమంత్రి నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలి వార్తలపై వివరణ అడిగితే కేసులు పెడతామంటూ తన అక్కసును వెళ్లగక్కారు