సద్దాం వద్ద రసాయన ఆయుధాలు తప్పుడు సమాచారమే
– టోని బ్లెయిర్
లండన్, అక్టోబర్ 25 (జనంసాక్షి):
సద్దాం రసాయన ఆయుధాలు వాడాడనే నిఘావర్గాల సమాచారం తప్పన్నారు. సిఎన్‌ఎన్ విలేకరి ఫరీద్ జకారియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బ్లెయిర్ ఒప్పుకున్నారు. ఇరాక్ యుద్ధ తప్పిదాలకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ క్షమాపణాలు కోరారు. అయితే సద్దాంను పదవీచ్యుతుడిని చేయడంపై మాత్రం సారీ చెప్పబోనన్నారు. 2003లో జరిగిన యుద్ధంలో జరిగిన పొరపాట్లకు క్షమించాలని కోరారు. అయితే సద్దాం హుస్సేన్‌ను పదవీచ్యుతుడిని చేయడం మాత్రం గొప్ప నిర్ణయమని బ్లెయిర్ చెప్పారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్లే ఇరాక్‌లో అల్‌ఖైదా, ఆ తర్వాత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వేళ్లూనుకున్నారని బ్లెయిర్ అంగీకరించారు.