సద్దుల బతుకమ్మ, దసరా పండుగను ఘనంగా నిర్వహించాలి
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్…
హన్మకొండ బ్యూరో చీఫ్ 22 జనంసాక్షి
గురువారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ
బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడానికి అన్నీ చర్యలు.
గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ కారణంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించలేకపోయామన్నారు.
ఈ సారి భద్రకాళి దేవి నవరాత్రి ఉత్సవాలకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని
పోలీస్ శాఖ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించే చోట్ల మరియు దసరా ఉత్సవాలు నిర్వహించే చోట్ల ముమ్మర ఏర్పాట్లు చేసి అలాగే మహిళ పోలీస్ సిబ్బందిని ఎక్కువగా అందుబాటులో ఉంచాలన్నారు.
బతుకమ్మ నిమజ్జనం చేసుకునే స్థలాలను గుర్తించి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. భద్రకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ బహుకరించిన ఆభరణాలు అలంకరించేందుకు ఊరేగింపుగా వచ్చే సమయంలో పోలీసు శాఖ పటిష్ట భద్రత కల్పించాలని
సంప్రదాయ బద్దంగా బతుకమ్మ,దసరా ఉత్సవాలను నిర్వహించాలన్నారు.
పద్మాక్షమ్మ,సిద్దేశ్వర ఆలయాల వద్ద బతుకమ్మ ఉత్సవాల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.
అలాగే మహిళలు పలు కాలనీలు ఏకమై ఒకే చోట బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటున్నందున ఆట స్థలాలను గుర్తించి అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయాలి.
అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని చీఫ్ విప్ అధికారులను ఆదేశించారు.
*మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ*
బతుకమ్మ మరియు దసరా నవరాత్రి ఉత్సవాలను అలాగే భద్రకాళి,పద్మాక్షమ్మ,సిద్దేశ్ వర,వెయ్యి స్థంబాల దేవాలయాల్లో నవరాత్రి ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ చేసేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
*జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు* మాట్లాడుతూ బతుకమ్మ మరియు దసరా నవరాత్రి ఉత్సవాల కోసం అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి బతుకమ్మ పండుగను మరియు దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు.
అలాగే భద్రకాళి దేవి నవరాత్రి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికార యంత్రంగాన్ని ఆదేశించారు.
అలాగే భద్రకాళి ఆలయానికి ఒక అధికారిని మరియు పద్మాక్షమ్మ,సిద్దేశ్వర రెండు ఆలయాలకు కలిపి అలా అధికారిని ఇంచార్జ్ గా నియమించాలన్నారు.
*మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ* దసరా నవరాత్రి ఉత్సవాలను మరియు బతుకమ్మ పండుగను విజయవంతం చేయడానికి అలాగే భద్రకాళి దేవినవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాడానికి ఆలయ అధికారులు మరియు పూజారులు కోరిన విధంగా మున్సిపాలిటి తరుపున అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ, ఏసిపి కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో వెంకటేశ్వర్, జిల్లా అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area