సఫాయి కార్మికుని అవతారం ఎత్తిన సర్పంచ్.
సఫాయి కార్మికుల సమ్మెతో గ్రామాల్లో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన చెత్తాచెదారం . రోజువారీ కూలీ 700 నుండి 1000 వరకు డిమాండ్ చేస్తున్న తాత్కాలిక కూలీలు .గ్రామ పంచాయతీల్లో నిధుల కొరతతో సపాయి కార్మికుని అవతారం ఎత్తిన సర్పంచ్.
దౌల్తాబాద్ జూలై 17 , జనం సాక్షి.గ్రామ పంచాయతీలో పనిచేసే సఫాయి కార్మికులు నిరవదిక సమ్మెలో పాల్గొనడంతో దౌల్తాబాద్ గ్రామ వీధుల్లో చెత్త కూరుకపోగా సర్పంచ్ ముత్యం గారి యాదగిరి కార్మికునిగా మారి చెత్తా చెదారాన్ని తొలగించారు. వర్షాకాలం కావడంతో ప్రజలకు పారిశుధ్యం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని సర్పంచ్ యాదగిరి ట్రాక్టర్ నడపారు. వీధుల్లోని చెత్త ట్రాక్టర్ లో వేసారు. ప్రజలు చెత్తా చెదారాన్ని రోడ్లపై వేయకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని గ్రామ ప్రజలను సర్పంచ్ కోరారు. సర్పంచ్ సఫాయి కార్మికునిగా మారడం పట్ల గ్రామ ప్రజలు ప్రశంసలు కురిపించారు.