సబితా ఇంద్రారెడ్డిని కలిసిన విజయశాంతి
హైదరాబాద్ : తెలంగాణవాదులతో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఎంపీ విజయశాంతి ఆరోపించారు. విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భంగా పోలీసులు తెలంగాణవాదులతో వ్యవహరించిన తీరుపై అమె హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని స్వయంగా వివరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో తెలంగాణవాదులు ఆయా పార్టీల వైఖరిని ప్రశ్నించడం తప్పా అంటూ అమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రాయలసీమ నేతలకు ఎర్రతివాచీ పరుస్త్తున్నారని అమె ఆరోపించారు.