సభాపతికి లేఖపై తెదేపాను తప్పుబట్టిన మంత్రులు
హైదరాబాద్ : సభాపతికి లేఖ రాయడంపై మంత్రులు శ్రీధర్‌బాబు, కన్నా లక్ష్మీ నారాయణ, అనం రాంనారాయణరెడ్డి, రఘవీరా తదితరులు తెలుగుదేశం పార్టీని తప్పుబట్టారు. తెదేపా నేతలు సభాపతి వ్యవస్థను కించపరుస్తున్నారని మంత్రులు అరోపించారు. 13వ శాసనసభలో అందరికన్నా ఎక్కువ మాట్లాడింది చంద్రబాబేనని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సభాపతికి రాసిన లేఖలో చంద్రబాబు నిరాశ, నిస్కృహలు బయటపడ్డాయని మంత్రి రామచంద్రయ్య అన్నారు.