సమగ్ర వ్యాక్సిన్‌తోనే రక్షణ ! `
కరోనా థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ..మన వ్యాక్సిన్ ఎంతమేరకు పనిచేస్తుందో బేరీజు వేసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై అధ్యయనం చేయాలి. వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుందన్న భరోసా ఇంకా రాలేదు. ఇప్పటికే మన దేశంలో వందకోట్ల డోసులు పూర్తి చేసుకున్నాం. అయినా ఇంకా చాలామందికి వ్యాక్సిన్ అందాల్సి ఉంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ కరోనా ప్రభావం చూపుతోంది. కొందరు రెండు డోసులు తీసుకున్న వారు మరణించిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో థర్డ్‌వేవ్ª`ను వ్యాక్సిన్ అండుడుకుంటుందా లేదా అన్నది తెలియాలి. అలాగే ఎన్ని వేరియంట్లు వచ్చినా తట్టుకునేలా మన వ్యాక్సిన్‌ను అభివృద్ది చేసుకోవాల్సన అవసరం ఉంది. అమెరికా లాంటి దేశాల్లో బూస్టర్ డోస్ వచ్చిందని అంటున్నారు. అయినా రష్టాలాంటి దేశంలో మళ్లీ మరణమృదంగం మోగుతోంది. ఈ క్రమంలో పిల్లలకు ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ జరగలేదు. ఒకపక్క కరోనా మహమ్మారి మూడోదశ మన దేశంలోనూ విరుచు కుపడే అవకాశమున్నదని, ఈసారి ప్రధానంగా పిల్లలపైనే అది ప్రతాపం చూపబోతున్నదని అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో వారి కోసం రూపొందించిన కోవాగ్జిన్ టీకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ఈ వ్యాక్సిన్ దేశ ప్రజలకు ఊరటనిస్తుందని ఇప్పుడే చెప్పలేం. పదికోట్ల డోసులు పూర్తి చేసుకున్న సందర్బం గా పిల్లలకు కూడా త్వరగా టీకా వస్తే మంచిది. పౌరులకు టీకాలందించే కార్యక్రమం మన దేశంలో జోరందు కుంది. అనేక రాష్టాల్రు పట్టుదలగా దీన్ని కొనసాగిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో జనాభాలో మూడొంతుల మంది ఒక టీకా లేదా రెండు తీసు కున్నట్టవుతుంది. దీనిని త్వరగా అందుబాటులోకి తీసుకుని రావడం ముఖ్యం. ఇప్పటికే పిల్లలు ఇంటికి పరిమితం అయ్యారు. పాఠశాలలు మళ్లీ తెరుచుకున్నా భయంభయం గానే వెళుతున్నారు. ఏడాదిన్నరకుపైగా పాఠశాలలు మూతబడి, ఆన్‌లైన్‌లో మాత్రమే చదువులు సాగు తున్న తీరు అత్యధిక శాతంమంది పిల్లలను చదువులకు పూర్తిగా దూరం చేసింది. ఒక అంచనా ప్రకారం 5 కోట్ల మంది పిల్లలు ఆన్‌లైన్ చదువులకు అవసరమైన సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు కొనుక్కునే స్థోమతలేక పూర్తిగా వెనకబడ్డారు. ఇక క్రీడా శిక్షణ సంస్థలు, కోచింగ్ కేంద్రాలు వగైరాలు కూడా చాన్నాళ్లుగా మూత బడ్డాయి. ఇప్పుడిప్పుడే వాటిని మళ్లీ తెరుస్తున్నా ఇంకా హాజరు శాతం పెరగడం లేదు. బడులు తెరుచు కున్నా ఇప్పటికీ తమ పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు సందేహిస్తూనే ఉన్నారు. ఇంటికే పరిమితమైతే పిల్లల చదువులకు మాత్రమేకాక… వారి మానసిక, శారీరక ఎదుగుదలకూ అది అవరోధమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగని ప్రాణాలకు ముప్పు పొంచివుందన్న భయాందోళనలు వారిని పీడిస్తూనే ఉన్నాయి. ఇక బడుల్లో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సివస్తోంది. మాస్క్‌లు ధరించటం, శాని టైజర్ వాడకం, దూరం పాటించడం తదితరాలతో తరగతి గదులు కూడా గతంలో మాదిరి స్వేచ్ఛాయుత వాతావరణానికి అవకాశం లేకుండా పోయింది. బడులకు వెళ్లొస్తున్నారన్న మాటేగానీ… అంతా సవ్యంగా ఉందో లేదోనన్న ఆందోళనలో అటు పిల్లలూ. ఇటు తల్లిదండ్రులూ ఉన్నారు. పిల్లలకు సైతం వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులుండవు. నిజానికి వారికి సమర్థ టీకా ఆవశ్యక్త ఉంది. 2`18 సంవత్సరాల మధ్యవారికి కోవాగ్జిన్ టీకాను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించ వచ్చని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్‌నుంచి పూర్తిస్థాయిలో దీనికి గ్రీన్ సిగ్నల్ లభిస్తే ప్రపంచంలోనే తొలిసారి రెండేళ్లు, అంతకు పైబడిన పిల్లలకు టీకా వినియోగించే దేశంగా భారత్ నిలుస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను రూపొందించిన భారత్ బయోటెక్ ఇప్పటికే మూడుదశల క్లినికల్ పరీక్షల డేటాను అందజేసింది. తుదిదశ సమాచారం రావాల్సివుంది. జైకోవ్`డీ అనే టీకాకు సైతం అత్యవసర విని
యోగానికి అనుమతులు లభించాయి. అయితే అది 12`18 సంవత్సరాల మధ్యవారి కోసం రూపొందిం చింది. అలాగే 5`18 మధ్య వయసున్న పిల్లలకు కార్బీవ్యాక్స్, 2`18 ఏళ్ల మధ్యవారికి తయారైన కోవోవ్యాక్స్‌లు ఇంకా ప్రయోగ దశలో ఉన్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ అనుమతుల విషయంలో గతంలో వచ్చిన విమర్శలవంటివి తలెత్త కుండా డీసీజీఐ అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. వ్యాక్సిన్‌ల వాడకం సురక్షితమైనదని నిపుణుల కమిటీ మాత్రమే అభిప్రాయపడితే చాలదు. సీజీఐ సంస్థ వెలుపల కూడా ఆరోగ్య రంగంలో పని చేసే నిపుణులు ఉన్నారు. వారు కూడా అధ్యయనం చేసేందుకు వీలుగా డీసీజీఐ ఆ డేటాను అందుబాటులో ఉంచాలి. క్లినికల్ పరీక్షల్లో వెల్లడైన అంశాలేమిటో, వాటి లోతుపాతులే మిటో ఆరోగ్యరంగ నిపుణులు నిశితంగా పరిశీలిస్తారు. ఒక దశ ప్రయోగానికీ, మరో దశ ప్రయో గానికీ మధ్య ఉన్న వ్యవధి, టీకాలు తీసుకున్నవారిలో వెల్లడైన లక్షణాలు అధ్యయనం చేస్తారు. వ్యాక్సిన్‌ల విషయంలో పెదవి విరిచేవారిని సైతం అటువంటివారి అభిప్రాయం సంతృప్తి పరుస్తుంది. పెద్దల కోసం రూపొందించిన టీకా యధాతథంగా పిల్లలకు ఇవ్వటం సాధ్యపడదు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఎన్నో జాగ్రత్తలు సూచించింది. శారీరక ఎదుగుదల చక్కగా ఉండే శైశవ, బాల్య, కౌమార, యౌవన దశల్లోనివారు కావటం, వారికుండే భిన్నమైన వ్యాధి నిరోధకత ఇందుకు కారణం. ఇప్పటికే 12`18 ఏళ్ల వారికి టీకాలందిం చిన ఇజ్రాయెల్‌కు ఈ విషయంలో కొంత అనుభవముంది. పెద్దల టీకాల విషయంలోనే అనేకమందిలో ఇంకా సందేహాలు ఉన్నాయి. ఆ పరిస్థితి పిల్లల టీకాల విషయంలో తలెత్తకూడదు. ప్రభుత్వాలు ఎటూ పిల్లల టీకాలను కూడా ఉచితంగా పంపిణీ చేసే అవకాశం ఉంది. అయితే బయట కొనదల్చుకున్నవారికి సైతం అందుబాటులో ఉండేలా ఆ టీకాల ధర నిర్ణయించాలి. పిల్లలకిచ్చే టీకాలు సైతం పూర్తి స్థాయిలో అందుబాటులోకొచ్చి, సాధ్యమైనంత ఎక్కువమందికి అందించగలిగితే జనాభాలో అత్యధికులు సురక్షిత స్థితికి చేరుకున్నట్టవుతుంది. చదువులు మళ్లీ చురుకందుకుంటాయి. సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి.