సమగ్ర సర్వే నిర్వహించండి : జేసీ
శ్రీకాకుళం, జూన్ 12 : సమన్వయంతో పనిచేసి సమగ్ర సర్వే నిర్వహించి ఆటవీ భూములను పంపిణీ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.భాస్కర్ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సమన్వయం లోపం కారణంగా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నయన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెవెన్యూ, ఆటవీ శాఖ, సర్వే, ఐటీడీఏ అధికారులతో ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ 12 మండలాల పరిధిలో 4,699 మంది లబ్ధిదారులకు సంబంధించి 10 వేల ఎకరాలు సర్వే చేయడం జరిగిందన్నారు. వీటికి ఇందిరా క్రాంతి పథం సర్వేలతో హద్దులు నిర్ణయించాలని పేర్కొన్నారు. సాంకేతిక పరంగా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సునీల్ రాజ్‌కుమార్, డిఆర్వో నూరుభాషాఖాసీం తదితరులు పాల్గొన్నారు.