సమన్వయంతో ముందుకు సాగుదాం
‘మేధోమథనం’లో పార్టీ శ్రేణులకు సోనియా దిశానిర్దేశం
సూరజ్‌కుండ్ (హర్యానా), నవంబర్ 9 (జనంసాక్షి):
లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. గత ఎనిమేదేళ్లలో యూపీఏ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మూడొ ళిసారి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ, ప్రభుత్వానికి మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి ముందుకు సాగాలన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను అమలు చేసే దిశగా కృషి చేయాలని సూచిం చారు. అలాగే, ఆర్థిక సంస్కరణలు చేపట్టడానికి గల కారణాలను సూటిగా, స్పష్టంగా అర్థమయ్యేలా ప్రజల్లోకి తీసుకెళ్లాని కోరారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తన్నాయని సోనియా విమర్శించారు. ప్రస్తుతం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నామని, వాటిని అధిగ మించేందుకు
తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందన్నారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో ప్రారంభమైన పార్టీ మేథోమధన సదస్సులో సోనియా అధ్యక్షోపాన్యాసం చేశారు. 2014 ఎన్నికలే లక్ష్యంగా సోనియా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతున్న నేపథ్యంలో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలని సూచించారు. ఇప్పటివరకూ దృష్టి సారించని సమస్యలపై నేతలు మరింత శ్రద్ధ పెట్టాలని కోరారు. మంత్రులు సమర్థవంతంగా పని చేసి ఫలితాలే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. 2014 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మంత్రులు, సీనియర్లు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు.
2009 ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను తప్పనిసరిగా అమలు చేయాలని, మేనిఫెస్టోలోమిగిలిపోయిన హావిూలపై దృష్టి సారించాలని సూచించారు. పార్టీ పటిష్టత కోసం ఆర్థిక వనరులను సైతం సమకూర్చుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో పార్టీ శ్రేణులను సంతృప్తి పరచడం లేదని సోనియా తెలిపారు. పార్టీ అవసరాలు, లక్ష్యాలతో సహా ప్రభుత్వ పరిమితులను సైతం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై సోనియా ప్రశంసల జల్లు కురిపించారు. ఆర్థిక సవాళ్లను అధిగమించడంలో, నుంచి దేశాన్ని రక్షించడంలో మన్మోహన్ నాయకత్వం ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వ విధానాలను పార్టీ శ్రేణులకు అర్థమయ్యేలా వివరించాలని కోరారు. ప్రతిపక్షాలపై సోనియా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి రావడమే పరమావధిగా ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, లౌకికక విలువలను బలహీనపరుస్తుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఆర్థిక సంస్కరణలతో పాటు వివిధ అంశాలపై ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఉన్న భేదాభిప్రాయాలను తొలగించుకోవాలని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వం తీసుకొనే కొన్ని నిర్ణయాల వల్ల పార్టీ వర్గాలు అసంతృప్తికి గురవుతున్నాయి. అలాంటి అవకాశాల్లేకుండా పార్టీ, ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి’ అని సూచించారు. ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుందని, ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలకు వివరించడం పార్టీ నేతలుగా మన బాధ్యత అని చెప్పారు.
2014 ఎన్నికలే కాంగ్రెస్ పార్టీ మేథోమధన సదస్సు జరిగింది. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూల అమలు, భవిష్యత్ వ్యూహాలతో పాటు త్రిసూత్ర అజెండాపై సవిూక్ష నిర్వహించనున్నారు. యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇలాంటి సమావేశం ఇదే మొదటిసారి. సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్‌గాంధీ, మరో 70 మంది ప్రతినిధులు మేథోమధనం సదస్సుకు బస్సులో రావడం విశేషం. కొద్ది రోజుల క్రితం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగిన రాజ్ హన్స్ ¬టల్‌లోనే కాంగ్రెస్ ఈ సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.