సమయాన్ని పాటించు ఏఎన్ఎం కవిత కు డిప్యూటీ డిఎంహెచ్ఓ వార్నింగ్
బషీరాబాద్ ఆగస్టు 6,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ బషీరాబాద్ లో శుక్రవారం రాత్రి సమయంలో వ్యక్తికి పాముకాటుకు గురి అయి ఆస్పత్రికి రావడంతో అక్కడ రాత్రిపూట వైద్య సిబ్బంది లేకపోవడం చాలా దారుణం అన్ని ప్రజలు మండిపడ్డారు. రాత్రి సమయంలో ఏఎన్ఎమ్ కవిత నైట్ డ్యూటీ లో లేక పోవడం పాము కాటుకు గురైన బాధితులు బషీరాబాద్ నుండి అంబులెన్స్ లో తాండూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లడం జరిగింది. ఏఎన్ఎం ఆలస్యంగా ఆస్పత్రికి రావడం జరిగింది. అందుకు ప్రజలు ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఉండి దండుగ అని చెప్పారు. ఈ విషయంపై శనివారం రోజున డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ధరణి కుమార్ మాట్లాడుతూ ఏ.ఎన్.ఎం కవితకు సమయాన్ని పాటించండి అన్ని వార్నింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. అదే విధముగా ప్రజలు బూస్ట్ డోస్ తీసుకోవాలని అని సూచించారు. బషీరాబాద్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సిబ్బంది కరువు ఉందని ఇక్కడ నైట్ డ్యూటీ లో స్టాఫ్ నర్స్ లు లేకపోవడం ఇబ్బందిగా మారిందని అందుకు ఏఎన్ఎమ్ ల సహాయం తీసుకుంటున్నామని చెప్పారు. మనకున్న వైద్య సిబ్బందితో ఈ సారి సాధారణ కాన్పులు,ఓ.పి పేషెంట్లు పెరిగానని చెప్పారు. ఇకముందు ఇలాంటి సమస్యలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవ్య శ్రీ, ఆస్పత్రి వైద్య సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు.