సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి*

వైస్ ఎంపీపీ కొలిశెట్టి బుచ్చిపాపయ్య

మునగాల, నవంబర్ 23(జనంసాక్షి): మండలంలోని జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు మండల పరిధిలోని మాధవరం నుండి ఆకుపాముల వరకు జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని, మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను సివిల్ హాస్పిటల్ గా ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా జాతీయ రహదారిపై మసీదు వద్ద అసంపూర్తిగా నిర్మాణం చేసిన సర్వీస్ రోడ్డును పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మునగాల జన వేదిక నిర్వహించే ఆందోళన పోరాటాలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి ఉద్యమించేందుకు ముందుకు రావాలని మునగాల మండల వైస్ ఎంపీపీ కొలిశెట్టి బుచ్చిపాపయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల ముందు సర్వీస్ రోడ్డుపై మునగాల జనవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంతకాల సేకరణ కార్యక్రమంలో వారు మొదటి సంతకం చేసి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, జాతీయ రహదారిపై ఈనెల 12న శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా జిఎంఆర్ అధికార యంత్రాంగం మండల పరిధిలోని జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, నిజాం కాలంలో నిర్మించిన మునగాల ప్రభుత్వ వైద్యశాలను పునర్నిర్మించి, సివిల్ హాస్పిటల్ గా తీర్చిదిద్ది 24 గంటల వైద్యం అందించి, పోస్టుమార్టం సౌకర్యం ఏర్పాటు చేసి, నేషనల్ హైవే పై అంబులెన్స్ సౌకర్యంతో ప్రజలకు అన్ని రకాల వైద్య సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని, ఇప్పటికైనా అధికార యంత్రాంగం ఆ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జన వేదిక ఏర్పాటు చేసి ప్రజల తరఫున పోరాటం నిర్వహించడం అభినందనీయమని వారి సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చిల్లంచర్ల ప్రభాకర్, మునగాల జనవేదిక నాయకులు సిహెచ్ సీతారాం, మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేనేపల్లి వీరబాబు, ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి ఎస్ రాఘవరెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జి శివ, ఏఐవైఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎస్ మల్సూర్, జనవేదిక సభ్యులు పసుపులేటి సందీప్, మీసేవ శర్మ, అశోక్ రెడ్డి, బత్తిని సూరి, లింగరాజు, పురుషోత్తం, కిరణ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు