సమస్యల పరిష్కారం కోసం కృషి

మెదక్‌, జనవరి 30 (): మెదక్‌ పట్టణంలో ఇండ్ల స్థలాల విచారణ జరిపిన అనంతరం అర్హులను గుర్తించి వారికే ఇళ్ల స్థలాలను స్వాధీనం చేస్తానని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ అన్నారు. బుధవారంనాడుస్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ పిల్లికోటాల్‌ వద్ద ప్లాట్‌ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని కలెక్టర్‌ దృష్టికి విలేకరులు తేగా వాటిని విచారించిన తర్వాతే ఇంటి స్థలాలను చూపించడం జరుగుతుందని తెలిపారు. నర్సింహారెడ్డి అనే కూలి అభ్యర్థునకు కలెక్టర్‌ స్పందించి ఇండ్ల పట్టాల గురించి విచారిస్తామని తెలిపారు. జనాభా పెరుగుతున్న దృష్ట్యా సమస్యలు అధికమవుతాయని వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. మెదక్‌ పట్టణంలో సమస్యల పరిష్కారం కోసం తరచూ పర్యటిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.