సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):ప్రభుత్వ పథకాలు, పనులు, నిధులు ఎలాంటి సమాచారమైనా ప్రజలు తెలుసుకునే హక్కును సమాచార హక్కు చట్టం 2005 కల్పించిందని,ఈ చట్టాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సమాచార హక్కు చట్టం -2005 (ఎన్జిఓ ఆర్గనైజేషన్) తెలంగాణ రాష్ట్ర నియామక ఇన్చార్జి చందమల్ల సుధాకర్ అన్నారు.సమాచార హక్కు చట్టం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్ ఛార్జిగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కూనపరెడ్డి సంతోష్ నాయుడిని నియమిస్తూ నియామక పత్రం అందజేసి మాట్లాడారు.అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా సమాచార హక్కు చట్టం పనిచేస్తుందన్నారు. 2005లో స్థాపించిన తమ ఆర్గనైజేషన్ తెలంగాణలోని 33 జిల్లాల్లో 2200ల మంది సభ్యులతో విస్తరించిందన్నారు.సూర్యాపేట జిల్లాలో 140మంది సభ్యులు సమాచార హక్కు చట్టం బలోపేతానికి కృషి చేస్తున్నారని వివరించారు.ప్రజలు సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్ఛార్జి  కూనపరెడ్డి సంతోష్ నాయుడు  మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించి చట్టం బలోపేతానికి కృషి చేస్తానన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జిగా సంతోష్ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరు కరుణాకర్, రాష్ట్ర ఆర్గనైజర్ ప్రవీణ్ కుమార్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బత్తిని నాగేశ్వర్ రావు, జోనల్ ఇన్చార్జి నెమ్మాది వెంకటేశ్వర్లు, వరంగల్,  మహబూబ్ నగర్, సంగారెడ్డి,  ఖమ్మం జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.