సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

ప్రజాస్వామ్యంలో నాల్గవ స్థానంలో ఉన్న జర్నలిస్టులను లయన్స్ క్లబ్, ఐ.వి.ఎఫ్ అధ్వర్యంలో గుర్తించి సన్మానించడం చాలా గర్వంగా ఉందని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ జానకిరామ్ అన్నారు. బుదవారం జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా తూప్రాన్ లోని తిరుమల బేకరీ  అవరణలో  ఐ.వి.ఎఫ్ జిల్లా యూత్ అధ్యక్షులు నీల ప్రవీణ్ కుమార్ గుప్త ఆధ్వర్యంల సన్మానించి సత్కరించారు.  కేశవ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ కృష్ణ గౌడ్ జర్నలిస్ట్ లకు పెన్నులు, బిస్కెట్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ జానకిరామ్ మాట్లాడుతూ మానవ జన్మ ఉత్తమమైనదనీ అందులో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమని మంచి – చెడు గమనిస్తూనే అక్రమాలను, అన్యాయాలను వెలికి తీసి సమాజంలో ఉత్తమ జర్నలిస్టులు గా రాణించాలని సూచించారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల కోసం ప్రత్యేక చొరవ తీసుకుని అందరికీ సమాన ఫలాలు అందేలా కృషి చేస్తానని అన్నారు తూప్రాన్ మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ అశోక్ తూప్రాన్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శి వేణుగోపాల్,  భాస్కర్ గౌడ్, పెద్దిగారి నగేష్ గుప్త, పూర్ణరాజుగౌడ్,శివశంకర్ గౌడ్ కోవూరి శ్రీనివాస్ గుప్త, తిగుళ్ళ నాగరాజు,నర్సింహ రెడ్డి,.శివకృష్ణ గౌడ్,  రామస్వామి,   శ్రీనివాస్, ప్రశాంత్ కుమార్, నవీన్ కుమార్, సర్గల స్వామి తోపాటు తూప్రాన్ లయన్స్ క్లబ్ నాయకులు డిస్ట్రిక్ట్ చైర్మన్ ఫర్ స్కూల్ యాక్టివిటీస్, ఐ.వి.ఎఫ్ జిల్లా యూత్ అధ్యక్షులు లయన్ నీల ప్రవీణ్ కుమార్ గుప్త, సీనియర్ జర్నలిస్ట్,డిస్ట్రిక్ట్ చైర్మన్ ఫర్ లియో యాక్టివిటీస్ లయన్ జానకిరాం, లయన్ డెకరేషన్ పుట్ట వెంకటేష్, ఐ.వి.ఎఫ్ నాయకులు పాల్గొన్నారు