సమాజ్‌వాదీ పార్టీలో కొనసాగుతున్న వివాదం

1478331698-6205ములాయం పరివార్‌లో వివాదం కొనసాగుతూనే ఉంది. సమాజ్‌వాదీ పార్టీ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో ఈ వివాదం మరోసారి వెల్లడైంది. ములాయంసింగ్‌ కుమారుడు కాబట్టే అఖిలేష్‌కు ముఖ్యమంత్రి పదవి లభించిందని శివపాల్‌యాదవ్‌ విమర్శించగా, పార్టీని రక్షించుకోవడానికి ఎలాంటి పరీక్షకైనా సిద్ధమని అఖిలేష్‌ యాదవ్‌ ప్రకటించారు. శనివారంనాడు సమాజ్‌వాదీపార్టీ సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో ములాయం సోదరుడు, సమాజ్‌వాదీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్‌యాదవ్‌ ముందుగా విమర్శల పర్వానికి తెరతీసారు. ముఖ్యమంత్రి అఖిలేష్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అదృష్టంతోనే కొందరికి అన్నీ లభిస్తున్నాయన్నారు. కొందరు వారసత్వంగా పదవులు అనుభవిస్తున్నారని, ఎన్ని త్యాగాలు చేస్తున్నప్పటికీ కొంత మందికి ఏమీ లభించడం లేదని శివపాల్‌ ఘాటుగా విమర్శించారు. బాబారు శివపాల్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీని రక్షించుకునేందుకు ఎలాంటి పరీక్షకు అయినా తాను సిద్ధమని ప్రకటించారు. ‘ఇలాంటి విమర్శలకు నేను సమాధానం ఇవ్వను. నా మాటలను ఇప్పుడు మీరు ఇష్టపడకపోవచ్చు, కానీ..నేను మరణించిన తరువాత నా మాటలను గుర్తుంచుకుంటారని రామ్‌మనోహర్‌ లోహియా చెబుతుండేవారు. ప్రస్తుత మన లక్ష్యం 2017 ఎన్నికల్లో బీజేపీ, బీఎస్‌పీలను ఓడించడంగా ఉండాలన్నారు.