సమ్మె నోటీపు ఇచ్చిన టీఎంయూ, ఈయూ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఆర్టీసీ ఎండీకి గుర్తింపు సంఘాలైన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌లె సమ్మెనోటీసు ఇచ్చాయి. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని , రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యుతరైజ్‌ చేయాలంటూ, కొత్త పే కమిటీ వెంటనే నియమించాలని ఆర్టీసీ యాజమాన్యానికి పెట్టిన గడువు ముగియడంతో సమ్మె నోటీసు ఇచ్చారు. 14 రోజుల్లో సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెకు సిద్దమని ఆర్టీసీ కార్మికులు తెలిపారు.