సరికొత్త హంగులతో శాసనమండలికి నూతన భవనం
హైదరాబాద్: సరికొత్త హంగులతో శాసనమండలికి నూతన భవంతిని నిర్మించటానికి రూపోందించిన భవన ప్రాథమిక ప్రణాలిక ముసాయిదాకు ఆమోదముద్ర పడింది. శాసన సభాపతి నాదెండ్ల మనోహార్ కార్యలయంలో మండలి చైర్మన్ చక్రపాని, ధర్మాన ప్రసాదరావు, ఉన్నతాధికారలతో జరిగిన సమావేశంలో ఆమోదం లభించింది. శాసనసభ లాబీల పక్కనే పార్లమెంట్ తరహాలో సెంట్రల్‌హాల్ కొత్త భవనం నిర్మించనున్నారు. దీనిలోనే మంత్రుల చాంబర్లు, ఉబయసభల్లో సభ్యులున్న అన్ని రాజకీయ పక్షాల శాసనసభ పక్ష కార్యలయాలు, ప్రభుత్వ విప్‌లు, కమిటీ చైర్మన్‌ల కార్యలయాలు, గ్రంథాలయాలు, ఫలహారశాల, ఉంటాయి. దాని పక్కనే మండలి భవనం నిర్మిస్తారు. సరికొత్త విశాలమైన సౌకర్యవంతంగా ఉండెట్లు ప్లాన్ తయారు చేశారు. దీనికి ఓ వైపున 750కార్లు నిలిపేందుకు వీలుగా మరో బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతారు. ఈ మూడు భవనాలను అనుసందానిస్తారు. వీటన్నింటిని కలుపుతూ ఆకర్షణీయమైన రూపం వచ్చేలా నూతన భవనం నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు.