సరిహద్దులో నేపాల్ కాల్పులు
– భారతీయుడి మృతి
– ఉద్రిక్తత
ముంబై, నవంబర్2(జనంసాక్షి):
భారత్-నేపాల్ సరిహద్దులోని బిర్‌గుంజ్ ప్రాంతంలో నేపాల్ బలగాలు జరిపిన కాల్పుల్లో 19 ఏళ్ల భారతీయుడు చనిపోయాడు. ఏడుగురు గాయపడ్డారు. నేపాల్ కొత్త రాజ్యంగంలో తమకు హక్కులు కల్పించకపోవడంపై 40 రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న మధేశీలు నేడు కూడా నిరసన కొనసాగించారు. బిర్‌గుంజ్ ప్రాంతంలో భారత్-నేపాల్‌ను కలిపే వంతెనపైనుంచి ట్రక్కులు పోకుండా అడ్డుకున్నారు. నేపాల్‌కు నిత్యావసరాలు పోకుండా అడ్డుకున్నారు. దీంతో నేపాల్ బలగాలు కాల్పులు జరిపాయి. ఘటనపై కన్నెర్ర చేసిన సశస్త్ర సీమాబల్ డైరక్టర్ జనరల్ బిడి శర్మ నేపాల్‌ను హెచ్చరించారు. భారత విదేశాంగ శాఖ కూడా నేపాల్ బలగాల కాల్పుల్లో భారతీయుడు చనిపోవడంపై సీరియస్‌గా స్పందించింది. సమస్యలు బలగాలతో సాధ్యం కావని తెలిపింది.