సరోగసీ గర్భాలకు చెల్లు చీటీ

sushma-on-surrogacy

సరోగసీ ముసాయిదా బిల్లుకు కేంద్ర క్యాబినేట్‌ ఆమోదం తెల్పింది. అద్దె గర్భం విధానాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు పలు మార్గదర్శకాలను రూపొందించిన కేంద్రం.. విదేశీయులు, ఎన్నారైలు, సింగిల్ పేరెంట్‌, సహజీవనం చేసే దంపతులకు సరోగసీ విధానం వర్తించదని తేల్చి చెప్పింది. దాంతో పాటు ఇప్పటికే ఇద్దరు సంతానం కలిగిన దంపతులను సరోగసికి అనర్హులుగా ప్రకటించింది. ఓ జంట పెళ్లి చేసుకొని, కనీసం ఐదేళ్లు కలిసి జీవిస్తేనే ఈ విధానాన్ని అనుమతిస్తామని చెప్పారు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌.