సర్కారు వైఖరి మారకపోతే

మళ్లీ ‘సకలం’ బంద్‌ : దేవీప్రసాద్‌
హైదరాబాద్‌,అక్టోబర్‌ 31 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యోగుల సంఘాల చైర్మన్‌ దేవి ప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీమాథ్యూను కలిశారు. తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. కేసులు ఎత్తివేయకుంటే మళ్లీ సమ్మెకు దిగుతామని తెలంగాణ ఉద్యోగుల సంఘాల జేఏసీ హెచ్చరించింది. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. ఉద్యోగులపై ఎలాంటి కేసులు వుండవని మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చిందని ఉద్యోగసంఘాల ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆరోపించింది.