సర్కార్‌ బడులకే పంపండి

బడిబాటలో అందరూ సహకరించాలి

సిద్దిపేట,జూన్‌6(జ‌నం సాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారంఅందిస్తూ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసున్నదని డీఈవో రవికాంతరావు అన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బడిబాటకు వస్తున్న వారికి సహకరించి ప్రతి ఒక్కరూ తమ పిల్లలను సర్కార్‌ స్కూళ్లకు పంపాలని అన్నారు. ఆర్థికంగా కూడా నయాపైసా ఖర్చు లేకుండా ప్రబుత్వ బడుల్లో చదువు8 చెప్పడం జరుగుతోందన్నారు. కార్పొరేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకే ఆదర్శ పాఠశాలల్లో, గురుకుల ప్రవేశ పరీక్షల్లో ఎక్కువ సీట్లు సంపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేవిధంగా ఉపాధ్యాయులు ప్రత్యేకచొరువ చూపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యతోపాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌, సన్నబియ్యంతో కూడిన మధ్యా హ్న భోజనం వంటి పథకాలను విద్యార్థుల తల్లిదండ్రులకు బడిబాట కార్యక్రమలో భాగంగా వివరించారు. బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని, వాటిని సద్వినియోగం చే సుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించడానికి ముందుకు రావాలని కోరారు.